తెలంగాణ

telangana

'మా సమస్యలు పట్టవు కానీ మా ఓట్లు మీకు కావాలా?'

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 4:42 PM IST

Voter Innovative Protest in Yadadri

Voter Innovative Protest in Yadadri : రాష్ట్రంలో ఎటుచూసినా ఎన్నికల కోలాహలమే కనిపిస్తోంది. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు చెప్పులు అరిగేలా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈక్రమంలో ఓ ఓటరు చేసిన వినూత్న నిరసన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంపత్ అనే వ్యక్తి.. తమ సమస్యలు పరిష్కరించని రాజకీయ అభ్యర్థులు ఓటు అడిగేందుకు, తమ ఇంటికి రావొద్దని ఓ ప్లెక్సీని తన ఇంటి గుమ్మానికి ఏర్పాటు చేశాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.

మున్సిపాలిటీ కేంద్రంలో గత ఐదు సంవత్సరాలుగా.. పురపాలక కార్యాలయం చుట్టూ తిరిగినా తన ఇంటి వద్ద డ్రైనేజీ సౌకర్యం కల్పించడం లేదని సంపత్ వాపోయాడు. చివరకు ఏమి చేయలేక తన నిరసనను ఈ విధంగా తెలిపానని వివరించాడు. తమ పిల్లలతో సహా ఇంటిల్లిపాది ఆ మురికి కాలువు కారణంగా దోమల మోత, దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నట్లు.. ఆర్థికంగా నష్టపోతున్నట్లు వివరించాడు. మా బాధలు పట్టని మీకు.. మా ఓటు అడిగే అర్హత లేదని నిరసన వ్యక్తంచేశాడు.

ABOUT THE AUTHOR

...view details