తెలంగాణ

telangana

వారణాసిలో వైభవంగా కార్తీకపౌర్ణమి- అబ్బురపరచిన విద్యుత్​ దీపాలు, 70 దేశాల ప్రతినిధులు హాజరు

By ETV Bharat Telugu Team

Published : Nov 27, 2023, 11:05 PM IST

karthigai deepam in varanasi celebreshan 2023

Varanasi Dev Diwali 2023 :ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ప్రజలు వైభవంగా జరుపుకొన్నారు. ఈ పండగను ప్రతీ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. వేల సంఖ్యలో భక్తులు పుష్కర ఘాట్‌లకు చేరి.. భక్తి ప్రపత్తులతో దీపాలను వెలిగించి పూజలు చేశారు. పుష్కర ఘాట్‌ ప్రాంతమంతా భక్తులు వెలిగించిన జ్యోతుల కాంతులతో విరాజిల్లింది. కార్తీకపౌర్ణమి మహోత్సవాలు గత వంద ఏళ్లుగా ఈ ప్రాంత వారసత్వంలో భాగంగా ఉందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. ప్రధాని మోదీ కారణంగా ఈ పండగ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంతరించుకుందని వెల్లడించారు. ఈ సందర్భంగా 70 దేశాల దౌత్యవేత్తలు, అంబాసిడర్లు కార్తీక దీపోత్సవానికి హాజరయ్యారు. వారణాసి పుష్కర్‌ఘాట్‌ లో కాల్చిన బాణాసంచా.. రంగురంగుల కాంతులను విరజిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లి ప్రజలుకు కన్నుల విందు చేసింది. కార్తీకపౌర్ణమి పర్వదినంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వ నిర్వహించారు. గంగా హారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 

ABOUT THE AUTHOR

...view details