తెలంగాణ

telangana

కోదాడలో కాంగ్రెస్​కు మద్దతు తెలిపిన టీడీపీకి రుణపడి ఉంటా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 9:01 PM IST

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy Attends TDP Leaders Atmiya Sammelanam : కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డికి మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటానని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే చందర్రావుతో కలిసి ఉత్తమ్ హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, సీపీఐలకు సహకరిస్తామని తెలిపారు. తాను మంత్రిగా ఉన్నపుడు లక్షల ఇళ్లు కట్టిస్తే.. కేసీఆర్ అగ్గిపెట్టే ఇల్లు కట్టించారని ఎద్దేవా చేశారని మండిపడ్డారు. బిడ్డల భవిష్యత్ కోసం రాష్ట్రంలో కేసీఆర్​ను గద్దె దించాలని ప్రజలను కోరారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే రూ.2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హమీనిచ్చారు.  

Rahul Gandhi Election Campaign in Telangana :మరోవైపు తెలంగాణలోనూ ప్రచారం చేయడానికి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. అలాగే రాష్ట్రంలో వివిధ తేదీల్లో ఆరు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ రెండు హెలీకాప్టర్‌లను సిద్ధం చేసుకుంది. ఒకే రోజు రాష్ట్రంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశాలు ఉండే అవకాశాలున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details