తెలంగాణ

telangana

యువకుడికి గుండు కొట్టి.. ముఖంపై మూత్రం పోసి ట్రాన్స్​జెండర్ల వీరంగం

By

Published : Jul 29, 2023, 5:23 PM IST

Urination Incident In Uttar Pradesh

Urination Incident In Uttar Pradesh : ఉత్తర్​ప్రదేశ్​.. కాస్​గంజ్ ​జిల్లాలో ట్రాన్స్​జెండర్లు వీరంగం సృష్టించారు. తమ బృందంలో కలవడం లేదని ఓ యువకుడికి గుండు కొట్టారు. అనంతరం అతడి ముఖంపై మూత్రం పోసి అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ కావడం వల్ల.. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  

ఇదీ జరిగింది.. 
సహవరల్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో బసాయి గ్రామానికి చెందిన రఫీక్​ అనే వ్యక్తి కుమారుడు నన్​హూ. ఇతడు గంజ్​దుండ్వారాలో వంట మనిషిగా పని చేస్తున్నాడు. అయితే, అప్పుడప్పుడు పార్టీల్లో డ్యాన్స్​ చేయడానికి కూడా వెళ్తాడు.  ఈ క్రమంలోనే తమ బృందంలో చేరాలని ట్రాన్స్​జెండర్లు కరీనా, లాలీ, రిచాతో పాటు మరో ఇద్దరు నన్​హూపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు నన్​హూ తిరస్కరించడం వల్ల అతడిపై కక్ష పెంచుకున్నారు ట్రాన్స్​ జెండర్లు. జులై 26న పనిముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా.. బాధితుడు నన్​హూను దారిలో అడ్డగించారు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ. 10 వేలు దోచుకుని దాడి చేశారు. అక్కడితో ఆగకుండా గుండు కొట్టి.. బాధితుడి ముఖంపై మూత్రం పోశారు. అనంతరం తీవ్రంగా దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. గాయపడిన బాధితుడిని సమీపంలో ఉన్న పొలాల్లో పని చేసే వాళ్లు కాపాడారు. అయితే, ఈ అరాచకానికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. బాధితుడి ఫిర్యాదు, వీడియో ఆధారంగా నిందితులను గుర్తించారు పోలీసులు. శుక్రవారం సాయంత్రం నిందితులు కరీనా, లాలీ, రిచాతో పాటు వారి ఇద్దరు సహచరులు అసీమ్, పవన్‌లను కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.  

ABOUT THE AUTHOR

...view details