తెలంగాణ

telangana

Tractor Explosion in Nagarkurnool : పేలిన డ్రిల్లింగ్‌ ట్రాక్టర్‌.. ఇద్దరి దుర్మరణం

By

Published : Jul 2, 2023, 4:34 PM IST

Tractor

Two Died in Tractor Explosion in Nagarkurnool : ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. వారు రోజులాగే డ్రిల్లింగ్​ పని చేయడానికని పక్కనున్న గ్రామానికి వెళ్తున్నారు. ఇంతలోనే ట్రాక్టర్‌ టైర్‌ పేలి.. విగతజీవులుగా మారిపోయారు. ఈ ఘటనలో ట్రాక్టర్‌ రెండు భాగాలుగా విడిపోయింది. వివరాల్లోకి వెళితే.. డ్రిల్లింగ్ ట్రాక్టర్ టైర్‌ పేలి.. ఇద్దరు మృతి చెందిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాద స్థలిలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాల పాలై మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు.

హాజీపూర్ గ్రామం నుంచి పదర గ్రామానికి డ్రిల్లింగ్ చేయడానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్దాలు వచ్చాయి. ఆ ధ్వనులతో ఉలిక్కిపడ్డ చుట్టుపక్కల వ్యవసాయదారులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతులను హాజీపూర్ గ్రామస్థులుగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details