తెలంగాణ

telangana

స్కూటీపై ఇద్దరు అబ్బాయిలు లిప్​లాక్​.. పోలీసులు గట్టి షాక్​?

By

Published : Jun 1, 2023, 10:40 PM IST

Two boys liplocked on moving scooty

ప్రస్తుత రోజుల్లో ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ చేసేందుకు యువతీయువకులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. మరికొందరు కదులుతున్న బైక్​పై అసభ్యకరమైన పనులు చేస్తూ వైరల్​ అవుతున్నారు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లో రాంపుర్​ సివిల్​ లైన్​ ప్రాంతంలో ఇద్దరు అబ్బాయిలు.. స్కూటీపై బహిరంగంగా లిప్​లాక్​ చేస్తున్నట్లు కనిపించారు. అందుకు సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఓ బాలుడు స్కూటీ నడుపుతుండగా.. వెనుక మరొకరు కూర్చున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్కూటీ నడుపుతున్న అబ్బాయి వెనుకకు తిరిగి మరీ లిప్ లాక్ చేస్తున్నాడు. ఇద్దరు అబ్బాయిలు లిప్ లాక్ చేస్తూ రోడ్డుపై వెళ్తున్నట్లు వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సన్సార్ సింగ్ చెప్పారు. ఈ వీడియో ఎప్పుడు జరిగిందనేది ఇంకా తెలియరాలేదని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనలను ఎక్కువ మంది యువత ఉల్లంఘిస్తున్నారని.. అందువల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details