తెలంగాణ

telangana

Travels Bus Catches Fire in Medchal : ట్రావెల్స్​​ బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 5:33 PM IST

Travels Bus Catches Fire in Medchal

Travels Bus Catches Fire in Medchal :మేడ్చల్ జిల్లాలో ట్రావెల్స్​​ బస్సు అగ్నికి ఆహుతయ్యింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. కాప్రా విజయ స్కూల్ సమీపంలో నిలిపి ఉంచిన ట్రావెల్స్ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో.. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 

Travels Bus Fire Accident in Medchal District : హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది. అయితే గత మూడు నెలలుగా బస్సును ఉపయోగించడం లేదని.. స్కూల్​ సమీపంలో ఒకే చోట నిలిపి ఉంచినట్లు స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలను అన్వేషిస్తున్నారు. ఆకస్మికంగా జరిగిన ప్రమాదామా..? లేదా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

ABOUT THE AUTHOR

...view details