తెలంగాణ

telangana

Prathidwani : ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. చంద్రబాబు అరెస్ట్​తో మిన్నంటిన నిరసనలు

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 9:35 PM IST

Prathidwani Debate on Chandrababu Naidu Arrest

Prathidwani Debate on Chandrababu Naidu Arrest : మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా.. రాజ్యాంగం ప్రసాదించిన చట్టబద్ద పాలనలోనే జీవిస్తున్నామా? అసలే ఉత్తరకొరియా నియంత కిమ్, అప్ఘనిస్థాన్‌లో రాక్షాస పాలన సాగిస్తున్న తాలిబాన్లను.. జగన్‌ & కో మించి పోతున్నారన్న విమర్శల నేపథ్యంలో ఈ చర్చను మరింత విస్తృతం చేసింది. 2015 జూన్‌ నాటి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయంటూ.. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని ఏపీసీఐడీ ఎలాంటి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. 

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల జులుంతో.. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్టులో అంతకు మించిన నిరంకుశ, అరాచక పాలనను కళ్లకు కట్టారని విపక్షాలు భగ్గమంటున్నాయి. అసలు.. ఎఫ్​ఐఆర్​లో పేరు లేకుండా, నోటీసులు ఇచ్చి.. సమాధానం తీసుకునే అవకాశం కూడా కల్పించకుండా అర్థరాత్రి చుట్టుముట్టి చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నిరసన తెలిపినవారిని ఖాకీలు చావబాదిన దృశ్యాలు దేనికి సంకేతం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details