తెలంగాణ

telangana

Prathidwani: గుండె గండం నుంచి గట్టెక్కేది ఎలా.. నివేదికలు, వైద్యులేం చెబుతున్నారు?

By

Published : Mar 1, 2023, 10:58 PM IST

Pratidwani

Prathidwani: ఉరిమే ఉత్సాహానికి చిరునామా అయిన యువ హృదయాలు... అర్ధాంతంరంగా ఆగి పోతున్నాయి. వ్యాయామం చేస్తూనో.., ఆటలు ఆడుతూనో ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే చూసే గుండెపోటును ఇప్పుడు.. యుక్తవయసు వారిలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఆహారపు అలవాట్లు, ధూమ, మద్యపానం, శారీరక వ్యాయామం లేకపోవడం తక్కువ వయసులోనే గుండె జబ్బు పాలవడానికి ప్రధాన కారణాలు. నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటీవల యువత ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో ఆసుపత్రుల బాట పడుతున్నారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే 80 శాతం గుండె వ్యాధులను నివారించవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. 

నగర జీవనమంటే ఒత్తిడి మయం. ఈ కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం సమస్యల బారిన ఎక్కువ మంది పడుతున్నారు. 50 శాతం మందికి తమకు అధిక రక్తపోటు ఉన్న సంగతే తెలియక చివరికి తీవ్ర హృద్రోగ సమస్యలకు కారణమవుతున్నాయి. కొవిడ్‌ సమయంలో సాధారణ జనాభాలో ఆందోళన చెందుతున్న వారి శాతం 30 నుంచి 33 శాతం వరకు ఉంది. ఇది గుండెపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒత్తిడి, ఆందోళనలతో రోగ నిరోధక శక్తి మరింత తగ్గిపోవచ్చు. ఎక్కువగా దిగులు, దుఃఖం సమయంలో గుండెపోటు రావడం వంటివి జరుగుతాయి. పక్షవాతం, గుండె జబ్బులకు అతి పెద్ద ముప్పు కారకం అధిక రక్తపోటు (హైబీపీ). బీపీ ఎక్కువగా ఉన్నా సరే ఎటువంటి హెచ్చరికలు, లక్షణాలు, సంకేతాలు కన్పించవు. లోలోన అది చేయాల్సిన నష్టం చేస్తుంది. అందుకే తరచూ బీపీ చూసుకోవడం అవసరం. 

కొవిడ్‌ తర్వాత ఇళ్లల్లో కూర్చొని చేసే ఉద్యోగాల్లో ఎక్కువ మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. వారంలో కనీసం అయిదు రోజుల పాటు అరగంట పాటు వ్యాయామానికి కేటాయించినా... చాలావరకు గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు. ఇలాంటివేవి మాకు లేవని చాలా మంది అనుకుంటారు. మరికొందరు తాను ఆరోగ్యంగానే ఉన్నామని.. ఎక్సర్​సైజులు చేస్తున్నామని, ఎలాంటి దురలవాట్లు లేవని అనుకుంటారు. కానీ గుండె లయ తప్పడం అందరిలో కనిపిస్తోంది. అసలు గుండెపోటు వచ్చేముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ సమస్యపై  అధ్యయనాలు, నివేదికలు ఏం చెబుతున్నాయి? వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు ఏమిటి? గుండె గండం నుంచి తప్పించుకోవాలంటే అందరు తప్పక తెలుసుకోవాల్సి, గుర్తెరిగి మసులుకోవాల్సిన అంశాలు ఏమిటి? ఇదే అంశంపై ప్రతిధ్వనిలో ఇవాళ చర్చింద్దాం.

ఈ రోజు చర్చలో పాల్గొంటున్న వారు:

1‌) డా. వై. కీర్తిరావు, ఎంఎస్, ఎంసీహెచ్‌, ఎయిమ్స్ న్యూదిల్లీ

కార్డియాక్‌ సర్జన్, ఉషా కార్డియాక్‌ సెంటర్, విజయవాడ

2‌) డా. జీవీ రెడ్డి, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు

ABOUT THE AUTHOR

...view details