తెలంగాణ

telangana

Teppotsavam at Warangal Bhadrakali Temple : అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి తెప్పోత్సవం

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 10:45 PM IST

Bhadrakali Temple Teppotsvam in Warangal

Teppotsavam at Warangal Bhadrakali Temple: ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారి దేవాలయం(Bhadrakali Temple)లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కాగా.. తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష పూజలతో పాటు ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని తీరొక్క పూలతో అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని తెప్పపై ఊరేగించారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని(Teppotsavam) తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వరంగల్​ నగరవాసులు తరలివచ్చారు. తెప్పపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.

Bhadrakali Temple Teppotsvam in Warangal: భద్రకాళి తల్లిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. విజయదశమి(Vijayadasami) పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. సర్వదర్శనం కోసం రెండు గంటల సమయం, విశిష్ట దర్శనానికి గంట సమయం పట్టింది. మరోవైపు.. విజయ దశమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు వాహనాలకు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details