తెలంగాణ

telangana

ప్రజా తీర్పు తెలంగాణ అమరవీరులకు అంకితం : ఆచార్య కోదండరామ్

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 5:28 PM IST

Telangana Jana Samithi Party Celebrations

Telangana Jana Samithi Party Celebrations At Martyrs Stupa : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో, తెలంగాణ జన సమితి పార్టీ హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం ముందు సంబరాలు జరుపుకుంది. పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు నృత్యాలు చేశారు. ప్రజా దీవెనను తెలంగాణ అమరులకు అంకితం చేస్తూ, గన్ పార్కు వద్ద ఆచార్య కోదండరామ్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును తెలంగాణ అమరవీరులకు అంకితం ఇచ్చినట్లు కోదండరాం తెలిపారు. తెలంగాణ జన సమితి నాయకులతో పాటు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Telangana Jana Samithi Celebrations In Hyderabad : తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విజయ జన సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసుల పేల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ, నృత్యాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ ఎన్నికల్లో పోటీ చేయన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details