తెలంగాణ

telangana

Talasani Srinivas Yadav Reacts on Jamili Election : జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధమే : తలసాని

By Telangana

Published : Sep 1, 2023, 7:42 PM IST

Minister Talasani Srinivas Yadav Reacts on Jamili Election

Minister Talasani Srinivas Yadav Reacts on Jamili Election : తాజాగా ఎన్నికల సర్వేలను పరిశీలిస్తే ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ అభిప్రాయపడ్డారు. అందుకే జమిలి ఎన్నికలకు వెళ్లబోతోందని అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో ఉంది కేసీఆర్ సర్కారు.. దేనికీ భయపడం అని స్పష్టం చేశారు. ఎన్నికలకు బీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధమేనని ఐతే షెడ్యూల్‌ ప్రకారమే రాష్ట్రంలో పోలింగ్‌ నిర్వహించాలని తలసాని డిమాండ్‌ చేశారు.

ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ఒకేసారి 115 అభ్యర్థులను ప్రకటించిందని.. బీజేపీకి ఆ నిబద్ధత లేదని ఆరోపించారు. ప్రజల్లో బీజేపీ మీద విశ్వాసం పోయిందని త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల్లో ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరిక అంశంపై స్పందించేందుకు మంత్రి తలసాని నిరాకరించారు.

ABOUT THE AUTHOR

...view details