తెలంగాణ

telangana

Simhadri Appanna: చందనోత్సవానికి ఎందుకు వచ్చానా..? స్వరూపానందేంద్ర

By

Published : Apr 23, 2023, 5:04 PM IST

స్వరూపానందేంద్ర సరస్వతి

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తుల ఇబ్బందులపై విశాఖ  శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా స్పందించారు. ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.  అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పేదలకు దేవుడిని వీఐపీల కోసం దూరం చేస్తారా అంటూ మండిపడ్డారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరించారని స్వరూపానందేంద్ర సరస్వతి ఆరోపించారు. గుంపులుగా పోలీసులను పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని మండిపడ్డారు. తన  జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేశారు.దర్శనానికి ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నట్లు  స్వరూపానందేంద్ర  పేర్కొన్నారు. కొండ కింద నుంచి పై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరని తెలిపారు. భక్తుల ఆర్తనాదాలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల ఇబ్బందుల మధ్య అప్పన్న  దర్శనం బాధ కలిగించిందని  స్వరూపానంద వెల్లడించారు. ఇలాంటి చందనోత్సవ నిర్వహణ ఎప్పుడూ జరగలేదని స్వరూపానందేంద్ర సరస్వతి ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details