తెలంగాణ

telangana

SRSP Gates Opened : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద.. 32 గేట్లు తెరిచిన అధికారులు

By

Published : Jul 28, 2023, 11:32 AM IST

srsp

SRSP 32 Gates Opened : రాష్ట్రంలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వరణుడి ప్రభావం ఉత్తర తెలంగాణ వైపు మరి ఎక్కువగా ఉంది. కాగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాజెక్టు నిండుకుండాలా మారాయి. పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి వస్తున్న వానలకు వాగులు, నీటి కుంటలు కళకళలాడుతున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండలా తలపిస్తూ అలుగు పారుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. అధికారులు 32 గేట్లను ఎత్తి 2 లక్షల 50 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజక్టులోకి ప్రస్తుతం 3లక్షల 8వేల నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1.091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1.088.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు అయితే ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 78.661గా ఉంది. ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో దిగువకు వరద పెంచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  

ABOUT THE AUTHOR

...view details