తెలంగాణ

telangana

నదిలో చిక్కుకున్న బస్సు.. 50 మంది ప్రయాణికుల్లో టెన్షన్​ టెన్షన్​.. చివరకు..

By

Published : Jul 22, 2023, 3:34 PM IST

bus struck in kotwali river

50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ఉత్తర్​ప్రదేశ్​లోని కోటావాలి నదిలో చిక్కుకుపోయింది. భారీ వర్షాలకు ఒక్కసారిగా నది ప్రవాహం అధికం కావడం వల్ల నది దాటుతున్న బస్సు మధ్యలోనే ఆగిపోయింది. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించారు.

ఇదీ జరిగింది
నజిబాబాద్​ డిపోకు చెందిన బస్సు సుమారు 50 మంది ప్రయాణికులతో బిజ్​నౌర్​ నుంచి ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​కు బయలుదేరింది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో రాష్ట్రాల సరిహద్దులోకి చేరేసరికి కోటావాలి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలోనే నది దాటుతుండగా వరద ప్రవాహం ఎక్కువై బస్సు మధ్యలోనే చిక్కుకుపోయింది. బస్సు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడడం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న మండావలి పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నది ప్రవాహం మరింత అధికం కావడం వల్ల బిజ్​నౌర్​తో పాటు హరిద్వార్​కు చెందిన రెస్క్యూ బృందాలతో ప్రయాణికుల్ని ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చారు. చివరకు జేసీబీని తెప్పించి ​బస్సులో చిక్కుకుని ఉన్న ఆరుగురు ప్రయాణికులను కాపాడారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని ఎస్​పీ ప్రవీణ్​ రంజన్ సింగ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details