తెలంగాణ

telangana

Viral Video: ఓ బైకర్ నిర్లక్ష్యం.. ఇద్దరి ప్రాణాలు తీసింది..

By

Published : Mar 12, 2023, 8:00 PM IST

ద్విచక్ర వాహనాలు ఢీ

Road accident at Kurikyala in Karimnagar district: మనిషి ప్రాణం కంటే విలువైంది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏటా ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రాణ నష్ట నివారణకు ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్లు ధరించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కానీ వాహనచోదకులు పూర్తి స్థాయిలో పాటించడంలేదు.  తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆత్రుతతో వేగంగా వెళ్లడం వల్ల వారి ప్రాణాలు పోవడమే కాకుండా ఎదురుగా వచ్చే వారి ప్రాణాలను హరిస్తున్నారు. 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద రోడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు కూడా హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలయి మృతి చెందారు. రామడుగు మండలం గోలిరామయ్యపల్లెకు చెందిన కొలిపాక మల్లేశం, గంగాధర మండలం ఇస్లాంపూర్​కు చెందిన నేరెల్ల సత్తయ్యలను మృతులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details