తెలంగాణ

telangana

కేసీఆర్‌ను ఓడిస్తేనే పేదలందరికి ఇళ్లు వస్తాయి : రేవంత్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 7:51 PM IST

Revanth Reddy

Revanth Reddy at Gajwel Public Meeting :గజ్వేల్‌ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్​రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌తో సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. గజ్వేల్‌ ప్రజల భూములను కేసీఆర్‌(CM KCR) గుంజుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ నిర్వాసితులు కేసీఆర్‌తో కొట్లాడారని తెలిపారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించాలని ప్రజలు నిర్ణయించారని రేవంత్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Revanth Reddy Election Campaign in Gajwel : ఓటమి ఖాయమని తెలిసే కేసీఆర్‌.. కామారెడ్డికి పోయారని రేవంత్ ఎద్దేవా చేశారు. అసలైన యోధుడు కామారెడ్డిలో ఉన్నాడు.. అక్కడా వదిలిపెట్టనని ధ్వజమెత్తారు. కామారెడ్డిలోనూ కేసీఆర్‌ను ఓడించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని ఆయన వివరించారు. కేసీఆర్‌ తన వడ్లను క్వింటా రూ.4250కి కావేరి సీడ్స్‌కు అమ్ముతారని విమర్శించారు. రాష్ట్ర రైతుల వడ్లకు మాత్రం రూ.1800లు చెల్లిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ దోచుకున్న రూ.లక్ష కోట్లను ముక్కు పిండి వసూలు చేస్తామని వెల్లడించారు. కేసీఆర్‌ను ఓడిస్తేనే.. పేదలందరికి ఇళ్లు వస్తాయని రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details