తెలంగాణ

telangana

భక్తి గీతాలు, శ్లోకాలు వింటున్న గోమాతలు.. డ్యాన్స్ చేస్తూ ఎక్కువ పాలు!

By

Published : Aug 5, 2023, 11:35 AM IST

ఆక్సిజన్ గోశాల పట్నా బిహార్

Oxygen Gaushala Patna Bihar : బిహార్​లోని ఓ గోశాలలో ఉన్న ఆవులకు శ్లోకాలు, భక్తి గీతాలు వినిపిస్తున్నారు నిర్వాహకులు. రోజూ ఉదయం, సాయంత్రం శ్లోకాలు వినిపిస్తూ.. గోవుల ముందు భజనలు చేస్తున్నారు. నిత్యం ఆవులకు ప్రత్యేక పూజలు చేస్తూ.. ప్రాచీన సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. ఆవులకు శ్లోకాలు, భక్తి గీతాలను వినిపించడం వల్ల అవి నాట్యం చేస్తూ.. ఎక్కువ పాలు ఇస్తున్నాయని నిర్వాహకులు వినోద్​ సింగ్ చెబుతున్నారు. పట్నాలోని బిహ్​తా బ్లాక్‌లోని విష్ణుపురా గ్రామంలో ఈ గోశాల ఉంది. కేవలం దేశీయ ఆవులతో గత కొన్నేళ్లుగా నడుస్తున్న ఈ గోశాలకు.. 'ఆక్సిజన్ గోశాల​' అని పేరు పెట్టాడు వినోద్​ సింగ్.

ఈ గోశాలలో మొత్తం 500 గిర్ జాతి ఆవులు వాటి దూడలు ఉన్నాయి. భారత్​లో​ దేశీ ఆవులు రోజురోజుకు అంతరించిపోతున్నాయని, వాటి రక్షణ కోసం ఇలా గోశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వినోద్​ తెలిపారు. దేశీ ఆవుల పరిరక్షణ కోసం ప్రచారం సైతం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అల్లం, ఉల్లిపాయలను కూడా పశువులకు పెట్టమని పేర్కొన్నారు. ఈ ఆవుల నుంచి వచ్చే పాలను విక్రయించమని.. సేవా కార్యక్రమాల కోసం మాత్రమే వినియోగిస్తామని వినోద్​ వివరించారు. గానుగ నూనె తీసేందుకు ఎద్దుల వినియోగిస్తాయని ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details