తెలంగాణ

telangana

ఒడిశాలో మరో ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

By

Published : Jun 17, 2023, 10:53 PM IST

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Odisha Goods Train Derails : ఒడిశాలో మరో రైలు ప్రమాదం జరిగింది. రాయగడ జిల్లాలోని అంబడోలా రైల్వే స్టేషన్​కు సుమారు 200 మీటర్ల దూరంలో.. గూడ్స్‌ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు అంబడోలా నుంచి లాండిగఢ్​ వేదాంత అల్యూమినా రిఫైనరీ ప్లాంట్​కు వెళ్తోంది. కాగా ​ప్రత్యేక మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తున్న కారణంగా ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని అధికారులు స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రైలు బోగీలను లైన్​ నుంచి తొలగించడానికి చర్యలు చేపట్టారు. ఇక రైలు పట్టాలు తప్పడానికి గల కారణాల గురించి విచారణ ప్రారంభించారు. కాగా, ఇటీవల ఒడిశాలోని బహానాగా రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 291 మంది మృతి చెందగా.. మరో 1200 మందికి పైగా గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details