తెలంగాణ

telangana

ODI World Cup 2023 : 'టీమ్​ఇండియాకు ఆ సత్తా ఉంది.. అతడు అద్భుతం చేస్తాడు'

By ETV Bharat Telugu Team

Published : Sep 30, 2023, 7:19 PM IST

ODI World Cup 2023 : 'టీమ్​ఇండియాకు ఆ సత్తా ఉంది.. ధోనీ ముందే వాటిని పసిగట్టగలడు'

ODI World Cup 2023  Chanchal Bhattacharya : మరో ఐదు రోజుల్లో వన్డే వరల్డ్​ కప్ 2023 గ్రాండ్​గా ప్రారంభంకానుంది. అయితే ఈ సారి వరల్డ్​ కప్​ను ముద్దాడే సత్తా రోహిత్ సేనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు మాజీ కెప్టెన్ ధోనీ చిన్ననాటి కోచ్​ చంచల్ భట్టాచార్య. రోహిత్​ కూల్​ పర్సన్​ అని, అలాగే జట్టును నడిపించే సమర్థవంతమైన నాయకుడని ప్రశంసించారు.  "​టీమ్​  మంచి బ్యాలెన్స్​డ్​గా ఉంది. జట్టులో అద్భుత ప్లేయర్స్​ ఉన్నారు. కోహ్లీ తన ఫామ్​ను కొనసాగిస్తే తప్పకుండా జట్టు గెలుస్తుంది.  అతడితో పాటు గిల్​పై గట్టి నమ్మకం ఉంది. అతడు తప్పకుండా ఏదో ఒక పెద్ద అద్భుతమే చేస్తాడు." అని భట్టాచార్య పేర్కొన్నారు. ధోనీ ముందే పసిగట్టగలడు..  "ప్రత్యర్థి జట్టు ఎలాంటి వ్యూహాలు రచించబోతుందో ధోనీ  ముందుగానే అంచనా వేయగలడు. మహీకి ఉన్న క్రమశిక్షణ, ఆట పట్ల నిబద్ధతే ఈ రోజు అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. మాన్​సూన్​ సీజన్​లో ప్రాక్టీస్​ చేయడానికి క్లిష్ట పరిస్థితుల్లు ఎదురైతే.. అతడు తన శిక్షణను ఆపేవాడు కాదు.  ప్రాక్టీస్​ కోసం దిల్లీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లి మరీ ప్రాక్టీస్ చేసేవాడు. తన స్కిల్స్​ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండేవాడు" అని భట్టాచార్య ధోనీపై ప్రశంసలు కురిపించారు.  

Pakistan Team In Hyderabad : 'హైదరాబాదీల వెల్​కమ్​కు మేమంతా ఫిదా..  వారి ప్రేమను చూస్తే పాక్‌లో ఉన్నట్లే ఉంది భాయ్​!'

ABOUT THE AUTHOR

...view details