తెలంగాణ

telangana

కోతుల బెడద అరికట్టే వారికే మా ఓటు - ఫ్లెక్సీలతో వినూత్న నిరసన

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 10:36 AM IST

Monkeys are destroying crops in Mahabubabad

Monkeys Destroying Crops In Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గ్రామానికి చెందిన ఓరైతు.. కోతుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు వినూత్నంగా నిరసన చేపట్టాడు. ప్రతి నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరు వానరాలతో ఇబ్బంది పడుతున్నారని దామోదర్​ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వరి, మొక్కజొన్న, మినుము, వేరుశనగ పంటలను కోతులు నాశనం చేస్తున్నాయని, వాటిని కొట్టబోతే మనుషుల మీదికి దాడికి దిగుతున్నాయని వాపోయాడు.  

An Innovative Protest To Save From Monkeys: ఆరుగాలం కష్ట పడి పండించిన పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయని దామోదర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇళ్లలోకి సైతం వస్తున్నాయని తన బాధను తోటి రైతులతో కలిసి నిరసన రూపంలో తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవట్లేదని వాపోయాడు. తమ ప్రాంతంలో కోతులను అరికట్టడానికి చర్యలు చేపట్టే అభ్యర్థికే తాము ఓటు వేస్తామని ఊరూరా తిరుగుతూ నిరసన తెలుపుతున్నాడు దామోదర్.

ABOUT THE AUTHOR

...view details