తెలంగాణ

telangana

ఆ అనుమానంతో బట్టలు విప్పి, జుట్టు కత్తిరించి మూకదాడి..

By

Published : Sep 3, 2022, 7:11 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

రాజస్థాన్ జైసల్మేర్​లో దారుణం జరిగింది. వివాహితతో లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడని ఓ యువకుడిపై పాశవికంగా దాడి చేశారు 15 మంది దుండగులు. యువకుడి బట్టలు విప్పి, జుట్టు కత్తిరించారు. అక్కడితో ఆగకుండా బాధితుడి బైక్​ను సైతం తగలబెట్టారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యులకు విషయం తెలియడం వల్ల ఘటనా స్థలానికి చేరుకుని రాజీ కుదుర్చుకున్నారు. బాధితుడిపై దాడికి పాల్పడింది వివాహిత గ్రామంలోని యువకులే. వివాహిత కుటుంబానికి, గ్రామస్థులకు క్షమాపణలు చెప్పాడు యువకుడు. ఈ దాడి దృశ్యాలను దుండగుల్లో ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details