తెలంగాణ

telangana

MLC Kavitha Was Invited by Oxford University : ఆక్స్​ఫర్డ్​లో ప్రసంగించాలని ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2023, 5:29 PM IST

MLC Kavitha Was Invited by Oxford University

MLC Kavitha Was Invited by Oxford University : ఎమ్మెల్సీ కవితకు డెవలప్​మెంట్​, ఎకనామిక్స్​ అనే అంశంపై ప్రసంగించేందుకు ప్రతిష్టాత్మక ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ ఆహ్వానించింది. ఈనెల 30న ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కవిత ప్రసంగించనున్నారు. లండన్​లో బ్రిడ్జ్​ ఇండియా సంస్థ నిర్వహించే కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి మోడల్​పై ఈనెల 30న ప్రసంగించేందుకు రావాలని ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ కోరింది. వారి ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి.. తెలంగాణ వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు, 24 గంటల ఉచిత విద్యుత్​, కులవృత్తులకు ప్రోత్సాహం, మిషన్​ భగీరథ, విద్య, వైద్య రంగాల్లో పురోగతిని వివరించనున్నట్లు కవిత తెలిపారు.  

మరోవైపు దసరా వేడుకల్లో భాగంగా కవిత నిజామాబాద్​ వెళ్లారు. నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయంలో ఎమ్మెల్యే గణేశ్​ గుప్తాతో కలసి పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మపై తాను రాసి, పాడిన పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. దసరా పండగ అంటేనే మహిళల విజయమని.. ప్రజలు సంతోషంగా ఉంటేనే పండగలు వైభవంగా జరుగుతాయని అన్నారు. ప్రజలకు మంచి చేసే వారికి సముచిత స్థానం కల్పించాలని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details