తెలంగాణ

telangana

MLA Rajaiah Latest Comments : 'ఆరు నూరైనా.. రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలో ఉంటా..' ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 8:40 PM IST

Mla Rajaiah Latest Comments

MLA Rajaiah Latest Comments : రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందిస్తున్న రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా పరిధిలోని ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు మండలాలకు సంబంధించిన బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారులుకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు నూరైనా రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలో ఉంటానన్నారు. భూమి కొని, మొట్టు తీసి, దుక్కి దున్ని, నారు పోసి, నీరు పోసి, రాసి చేస్తే.. ఎవరో వచ్చి రాసి మీద కూర్చుంటానంటే ఊరుకునేది లేదన్నారు. తన ప్రాణం అడ్డేసైనా ప్రజలను, కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనదని స్పష్టం చేశారు. పైన దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడని.. రేపో-మాపో మనం అనుకున్న కార్యక్రమం జరగబోతుందన్నారు. 'మీ కోసం నేనుంటా.. మీ మధ్యలో ఉంటా.. మీ కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే' అని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు.

ABOUT THE AUTHOR

...view details