తెలంగాణ

telangana

MLA Rajaiah Comments In Station Ghanpur : 'టికెట్టు నాదే.. గెలుపు నాదే.. రాజయ్య స్థానిక నినాదం'

By

Published : Aug 16, 2023, 7:46 PM IST

MLA Rajaiah Comments

MLA Rajaiah Comments In Station Ghanpur : స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక నినాదం తెరపైకి తెచ్చారు. అక్కపెళ్లిగూడెం గ్రామం వద్ద రూ.5 కోట్ల 75 లక్షల వ్యయంతో నిర్మించిన ఆరు కిలోమీటర్ల బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసారు. అనంతరం మాట్లాడుతూ మీ దయతో నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచానని  మీ అందరి ఆశీర్వాదంతో ఐదోసారి గెలిపించాలని రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్నికలు రాగానే.. స్థానికేతర నేతలు ఆరుద్ర పురుగులు వలె వస్తుంటారు, పోతుంటారని వ్యాఖ్యానించారు. బుజ్జి పెళ్లి రాజయ్య , ఆరోగ్యం, కడియం శ్రీహరి, విజయ రామారావు ఎవ్వరూ ఘన్​పూర్​లో పుట్టి పెరిగినవారు కాదన్నారు. స్థానిక నినాదం, స్థానిక నాయకుడు కావాలని ప్రజలు కోరుకున్న నేపథ్యంలో తాను రాజకీయాలకు వచ్చినట్టు చెప్పారు. స్థానికంగా ఉండి మీ కష్టసుఖాలు తెలిసిన వాడినని తనను వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను ఎమ్మెల్యే రాజయ్య కోరారు.

ABOUT THE AUTHOR

...view details