తెలంగాణ

telangana

రాములోరి దయతో భద్రాద్రిని అభివృద్ధి చేస్తా : మంత్రి తుమ్మల

By ETV Bharat Telangana Team

Published : Dec 17, 2023, 5:06 PM IST

Minister Tummala on Sitarama Project

Minister Tummala on Sitarama Project : భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో ఎన్ని అవమానాలు, ఒడిదొడుకులు ఎదురైనా మళ్లీ ఆ స్వామివారి సేవ కోసం కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామాలయం రోడ్డులో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామ కమ్మ సేవా సమితి వారి నూతన వసతి గృహాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ గతంలో భద్రాద్రిని తన హయాంలో ఎంతో అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు.

సీతారామచంద్ర స్వామి దయతో మళ్లీ భద్రాద్రిని అభివృద్ధి చేసే అవకాశం తనకు దక్కిందని అన్నారు. కమ్మ సేవా సమితి సమావేశంలో మాట్లాడిన ఆయన, ఈ జాతి నలుగురికి చేయూతని ఇచ్చే జాతి అని అన్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో శంకుస్థాపన చేసిన, భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన బ్రిడ్జిని మళ్లీ తానే ప్రారంభిస్తానని మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుతో రెండు జిల్లాల ప్రజలకు గోదావరి జలాలతో కాళ్లు కడుగుతానని అన్నారు. ఆ స్వామివారి దయతో తన హయాంలోనే భద్రాద్రి అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details