తెలంగాణ

telangana

Mega Drone Show at Komati Cheruvu in Siddipet : సిద్దిపేట కోమటి చెరువుపై​ మెగా డ్రోన్ షో.. చూస్తే ఫిదా కావాల్సిందే..

By ETV Bharat Telangana Team

Published : Aug 27, 2023, 10:51 PM IST

Siddipet District Latest News

Mega Drone Show at Komati Cheruvu in Siddipet :సిద్దిపేటలో కోమటి చెరువుపై మెగా డ్రోన్‌ షో (Mega Drone Show) కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్‌ షోను మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ వీక్షించారు. ఈ సందర్భంగా సిద్దిపేట అభివృద్ధిని డ్రోన్‌ షో ద్వారా నిర్వాహకులు ప్రదర్శించారు. 450 డ్రోన్‌ కెమెరాలతో మెగా డ్రోన్‌ షో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, హరీశ్‌రావు చిత్రాలతో పాటు.. ఐటీ టవర్‌, తీగల వంతెన లాంటి పలు ఆకృతులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యారు. దశాబ్ది ఉత్సవాల భాగంగా హైదరాబాద్​లో డ్రోన్​ షో చూడడం జరిగిందని హరీశ్​రావు తెలిపారు. కానీ మా సిద్దిపేట ప్రజలు కూడా చూడాలని దీనిని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. 

Dinosaur Park Siddipet :మరోవైపు కోమటి చెరువు వద్ద డైనోసర్ల జురాసిక్‌ పార్క్‌ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాక్‌గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్‌ పార్క్‌లతో వినూత్నమైన రీతిలో కొత్త అనుభూతిని కలిగించేలా డైనోసార్‌ పార్క్‌ అందుబాటులోకి రానుంది. సాహస అనుభవాలను, జ్ఞాపకాలను, మధురానుభూతులను కలిగించేలా ఈ పార్కు ఉండబోతోంది. 

ABOUT THE AUTHOR

...view details