తెలంగాణ

telangana

BRS Leader to Join Congress : బీఆర్​ఎస్​కు షాక్​... కాంగ్రెస్​లో చేరనున్న మరో కీలక నేత

By

Published : Jun 16, 2023, 2:14 PM IST

revanthreddy

BRS Leader Gurunathreddy to Join Congress : వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్‌... ప్రత్యర్ధిపార్టీలోని నేతలను ఆకర్షించే ప్రయత్నాలు సఫలం అవుతున్నాయి. కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కలిశారు. హైదరాబాద్‌లో గుర్నాథ్‌రెడ్డి నివాసానికి వెళ్లి కలిసిన రేవంత్‌రెడ్డి... రాష్ట్ర తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీలో చేరాలని కోరగా అందుకు గురునాథ్‌ రెడ్డి అంగీకరించారు. ఆదివారం ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని... పార్టీ వర్గాలు తెలిపాయి. గురునాథ్‌ రెడ్డి చేరికతో కొండగల్‌లో మరింత బలోపేతం అవుతామని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. 

మరోవైపు హస్తం పార్టీలో చేరేందుకు మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కూచుకుంట్ల దామోదర్‌రెడ్డి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 21న భారత్ వస్తున్న రాహుల్‌గాంధీతో... ఆ ముగ్గురు నేతలు సమావేశం కానున్నారని తెలిపాయి. ఆ తర్వాత ఖమ్మం, నాగకర్నూల్​లో పెద్ద బహిరంగసభలు ఏర్పాటుచేసి...  కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ తరుణంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, తెలంగాణ జనసమితి ఛైర్మన్ కోదండరాం భేటీ అయ్యారు. జూపల్లి ఇంటికి వెళ్లిన వారు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details