తెలంగాణ

telangana

KCR Announced Gas Cylinder for 400Rupees : రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌.. మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్‌

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2023, 5:13 PM IST

KCR

KCR Released BRS Manifesto 2023 : రాష్ట్రంలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను (BRS Manifesto) ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోలో మహిళలపై వరాల జల్లు కురిపించారు. మూడోసారి అధికారంలోకి రాగానే ఆర్హులైన లబ్ధిదారులతో పాటు అక్రిడేషన్‌ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 1100 రూపాయలకు చేరింది. దీనిపై విపక్షాలు ఎప్పటినుంచో ఆందోళనలు చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వం కూడా ఇటీవల సిలిండర్​పై 200 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్​ ధర ప్రభావం మధ్య, చిన్న తరగతి కుటుంబాలపై ఉందని గ్రహించిన గులాబీ బాస్.. మేనిఫెస్ట్​లో ఈ అంశాన్ని చేర్చారు. అర్హులందరికి రూ.400కే సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు.

BRS Manifesto 2023 : మరోవైపు కేసీఆర్‌ ఆరోగ్యరక్ష పేరుతో రూ.15 లక్షల వరకు బీమా పథకంను అమలు చేయనున్నట్లు.. జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో రూ.15 లక్షల వరకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో లక్ష.. రెండు పడకగదుల ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఏటా 3 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నామని.. వ్యవసాయరంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుందని కేసీఆర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details