తెలంగాణ

telangana

Kasani Gnaneswar on Chandrababu Naidu Release: చంద్రబాబు మంగళవారం విడుదల అవుతారు : కాసాని

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 5:31 PM IST

Kasani Gnaneswar on Chandrababu Naidu Release

Kasani Gnaneswar on Chandrababu Naidu Release: తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విడుదల అవుతారని ఆశిస్తున్నట్లు.. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొందన్నారు. చంద్రబాబుతో శనివారం ములాఖత్‌లో కలిసి.. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ఆయనకు వివరించినట్లు కాసాని తెలిపారు. చంద్రబాబు నిర్దోషిగా బయటకు వస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

NBK campaigning for TDP in Telangana Elections: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తున్నామని కాసాని జ్ఞానేశ్వర్ వెల్లడించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ  టీడీపీ కంటే బలంగా ఉందని తాము నమ్మడం లేదన్నారు. చంద్రబాబునాయుడు ఆలోచన విధానంతో.. రాష్ట్రానికి కావాల్సిన అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో ఉంటుందని కాసాని వివరించారు. ఇప్పటికీ 87మంది జాబితా తమ వద్ద ఉందని చంద్రబాబు ఆమోదం తర్వాత విడుదల చేస్తామని తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details