తెలంగాణ

telangana

కశ్మీర్​లో భారీగా హిమపాతం.. విరిగిపడిన కొండ చరియలు.. రవాణా సేవలకు తీవ్ర ఆటంకం

By

Published : Feb 11, 2023, 4:16 PM IST

Updated : Feb 14, 2023, 11:34 AM IST

jammu and kashmir snowfall

కశ్మీర్‌ లోయలో జోరుగా మంచు కురుస్తోంది. ఫలితంగా రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. హిమపాతం కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్నింటిని దారి మళ్లించారు. మరోవైపు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటం వల్ల రెండ్రోజులుగా జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రాంబన్‌ ప్రాంతంలో చిక్కుకుపోయిన ప్రయాణికులు, వాహనదారులకు ఆహారం అందించినట్లు అధికారులు తెలిపారు. శ్రీనగర్ జాతీయ రహదారిని పునరుద్ధించే పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.

Last Updated : Feb 14, 2023, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details