తెలంగాణ

telangana

Jaggareddy Meet Rahul Gandhi : జగ్గారెడ్డితో రాహుల్ గాంధీ స్పెషల్ భేటీ

By

Published : Jun 27, 2023, 4:55 PM IST

jaggareddy

Jaggareddy Meet Rahul Gandhi : దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలంగాణ నేతలతో సమావేశం అనంతరం రాహుల్ గాంధీ.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడారు. అలాగే మాట్లాడుకుంటూ ఆయనను తనతో పాటు టెన్​ జన్​పథ్​లోని సోనియా నివాసానికి తీసుకెళ్లారు. ఉదయం రాహుల్​ గాంధీకి అన్ని విషయాలు వివరిస్తానని చెప్పిన జగ్గారెడ్డి.. ఇప్పుడు ఇలా ఆయనను కలవడం రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాహుల్​తో భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డిలో భారత్​ జోడో ప్రభావం గురించి మాత్రమే రాహుల్ అడిగారని తెలిపారు. మీడియా అడిగిన ప్రశ్నలకు ఎలాంటి వివరణ ఇవ్వకుండా.. సమావేశ వివరాలు బయటకు మాట్లాడవద్దని కఠినంగా చెప్పారని వివరించారు. దయచేసి తనను ఎలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టవద్దని.. ఎందుకంటే తాను ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేనని వెల్లడించారు. రాహుల్​ గాంధీకి అన్ని విషయాలు చెబుతానని ఉదయం చెప్పారు కదా.. మరి చెప్పారా అంటే సమాధానం దాటవేశారు. ఆఖరికి కేకే వేణుగోపాల్​ వస్తున్నారని అక్కడి నుంచి జారుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details