తెలంగాణ

telangana

రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి : భారతి హోళికేరి

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 5:18 PM IST

Bharati Holikari Interview

Interview with Rangareddy District Collector :రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును పౌరులందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి పిలుపునిచ్చారు. ఈవీఎంలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే మూడు సార్లు శిక్షణ ఇచ్చామని ఆమె తెలిపారు. 

Bharati Holikari Interview : సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్​ శాతాన్ని పెంచేందుకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి.. సామాగ్రిని పంపిణీ చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అత్యంత కట్టుదిట్టంగా భద్రత ఉంటుందన్నారు. ఓటర్లను అభ్యర్థులు ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తున్నట్లయితే.. సీ విజిల్​ యాప్​లో ఫిర్యాదు చేయాలన్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరనున్నట్లు తెలిపారు. రేపు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్​తో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details