తెలంగాణ

telangana

Interview with Poet Pranavi : 'సమాజంలో మార్పు కోసమే నా రచనలు'

By

Published : Jul 19, 2023, 3:48 PM IST

Interview with Poet Pranavi

Interview with Poet Pranavi in Nizamabad: బడిలో చెప్పిన పాఠాలు ఆమెను మాతృభాషపై మమకారాన్ని పెంచాయి. దీంతో ఆమె భాషపై సాధన చేసి పట్టు సాధించింది. మాట్లాడం కంటే చదవడం, వినడం, రాయడం ఎక్కువగా ఇష్టపడేది.చిన్న చిన్న పద్యాలు, కవితలు రాస్తూ..  మరింత జ్ఞానాన్ని సంపాదించుకుంది.  తన భావాలను సిరాగా మలిచి పుస్తక రూపంగా మార్చింది. తన కవితలను, వచనలను సామాజిక మాధ్యమాల ద్వారా అందరికి తెలిసేలా చేసి.. అందరి మన్ననలు పొందింది మాదస్త ప్రణవి. ఆమెది నిజామాబాద్​ జిల్లాలోని ఇందల్వయి మండలంలో గౌరారం గ్రామం. ఓ గురువు ప్రోత్సాహంతో రాష్ట్రంలో జరిగిన కవి సమ్మేళనాల్లో పాల్గొంటూ.. పుస్తకాలు రాసింది ఆ కవయిత్రి. రాష్ట్ర స్థాయి కవితల పోటీల్లో చక్కగా రాణించి.. తన పుస్తక ముద్రణకు అవకాశం దక్కించుకుంది. తన పుస్తకాన్ని సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ప్రచరణ జరగనుంది. సమాజంలో మార్పు రావాలని తన కవితలను రాయడం ప్రారంభించింది. మరి, ఆ యువ కవయిత్రి భవిష్యత్‌ లక్ష్యం ఏంటి..? తన కవితల ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది..? ఆమె ఏమి విద్యా జీవితం ఎలా సాగింది? ఇలాంటి మరిన్ని విషయాలను ప్రణవి ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details