తెలంగాణ

telangana

భారీగా హిమపాతం.. విరిగిపడ్డ మంచుచరియలు.. ఇద్దరు మృతి

By

Published : Jan 12, 2023, 5:02 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో భారీ హిమపాతం సంభవించింది. గురువారం గందర్బాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోనామార్గ్‌లోని జొజియా ప్రాంతంలో.. భారీ ఎత్తున హిమచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నీల్‌గ్రాత్‌కు సమీపంలోని సర్బల్ ప్రాంతంలో జోజిలా టన్నెల్‌ నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ టన్నెల్‌ నిర్మాణ పనులు చేస్తోంది. అటు హిమపాతం ధాటికి పెద్ద ఎత్తున దుమ్ము గాలిలోకి ఎగసిపడింది. విపత్తు జరిగిన సమయంలో అక్కడి పక్షులు ఉలిక్కిపడ్డాయి. భయాందోళనతో ఘటనస్థలి నుంచి ఎగిరిపోయాయి. భారీగా పతనమవుతున్న ఉష్ణోగ్రతలతో శ్రీనగర్‌, జమ్ముకశ్మీర్‌లోని హిమాలయ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Last Updated :Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details