తెలంగాణ

telangana

మంచును తలపిస్తున్న వడగండ్ల వాన.. ఇదిగో వీడియో....

By

Published : Mar 16, 2023, 4:46 PM IST

Etv Bharat

 Heavy hail in vikarabad district ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు దంచి కొట్టిన ఎండ... ఒక్కసారిగా చల్లబడింది. ఇక సూర్యుని ప్రతాపానికి అల్లాడిపోయిన ప్రజలు... రాష్ట్రంలో కురిసిన వర్షానికి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వికారాబాద్‌లో మాత్రం వడగండ్ల వాన కురిసింది. ఒక్కసారిగా అక్కడి ప్రాంతం కశ్మీరిని తలపించింది. వికారాబాద్  జిల్లా మర్పల్లిలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. గ‌త వారం ప‌ది రోజుల నుంచి ఎండ‌లు మండిపోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌ర్షం పడటంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. ఇక జిల్లాలో ఎక్కడ చూసిన వడగండ్ల కనిపించాయి. రోడ్లపై, పంట పొలాల్లో ఎక్కడ చూసిన వడగండ్లే దర్శనమిచ్చాయి. ఇక రోడ్ల అయితే ఏ అమెరికానో తలపించేలా... వడగండ్లతో నిండిపోయాయి. వాటిని చూస్తుంటే.. మంచును తలపిస్తోంది. చిన్నారులకు ఇది ఓ కనుల విందని చెప్పవచ్చు. అనుకోకుండా వర్షం పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. 

ABOUT THE AUTHOR

...view details