తెలంగాణ

telangana

Harish Rao on organ Donation : 'అవయవదానంలో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ'

By

Published : Aug 3, 2023, 1:19 PM IST

Harishrao

Harish Rao on organ Donation in telangana 2023 : అన్ని దానాల్లో అవయవదానం గొప్పదని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 13వ జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా జీవన్​దాన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో అవయవదానం చేసిన కుటుంబాలను సత్కరించారు. అవయవదానం చేయడం వల్ల సమాజంలో మరొకరికి పునర్జన్మ ప్రసాదించినట్లవుతుందన్న మంత్రి.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవ‌య‌వ దానాల్లో రాష్ట్రం.. దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు.  ఒకప్పుడు అవయవమార్పిడి కోసం ధనికులు మాత్రమే అమెరికా, లండన్​ వంటి దేశాల్లో చేయించుకునేవారని .. కానీ నేడు కేసీఆర్​ హయంలో సామాన్యులకు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా అవయవ మార్పిడి చికిత్సలు 1675 జరగగా.. ఒక్క తెలంగాణలోనే 570 జరిగినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ ఈ వైద్య సదుపాయం అందుబాటులోకి తేవడానికి వీలుగా.. గాంధీ ఆసుపత్రిలో ఆర్గాన్​ ట్రాన్స్​ప్లాంట్​ బ్లాక్​ను ఏర్పాటు చేయనున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details