తెలంగాణ

telangana

Harish Rao Fires on Congress : 'బీఆర్​ఎస్ చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్‌ చెబుతున్న అబద్దాలకు పోటీ'

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 7:30 PM IST

Harish rao Distributes Kalyana Lakshmi Check

Harish Rao Fires on Congress: వచ్చే ఎన్నికల్లో బీఆర్​ఎస్​ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి.. కాంగ్రెస్‌ చెబుతున్న అబద్దాలకు పోటీ జరగబోతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారె‌డ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెండు పడకల గదుల ఇళ్ల(Double Bed Room Houses) లబ్ధిదారులకు ఆయన పట్టాలను పంపిణీ చేశారు. ముస్లీం మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులు, షాదీ ముబారక్‌, కళ్యాణలక్ష్మి, దివ్యాంగులకు పెంచిన పింఛన్‌ను చెక్కులను అందించారు. కంది మండలం చిమ్మాపూర్‌ చెరువు, సింగూరు ప్రాజెక్టుల్లో మంత్రి చేప పిల్లలను వదిలారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్‌ సంబంధించిన అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. 

Minister Harish Rao Comments on Congress: కాంగ్రెస్‌ది తన్నుల సంసృతి అయితే బీఆర్​ఎస్​ది టన్నుల సంసృతి అని వ్యాఖ్యానించారు. దేశంలోనే ఒకేసారి 9 వైద్యకళాశాలలను ప్రారంభించిన ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నిలిచారన్నారు. కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా ప్రస్తుతం 29 మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు ప్రకటించారు. మిగిలిన వారిని కూడా త్వరితగతిన చేర్చాలని అధికారులకు ఆదేశించారు. పని చేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందిరిపై ఉందన్నారు.

ABOUT THE AUTHOR

...view details