తెలంగాణ

telangana

మేడిగడ్డపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి : హరీశ్​రావు

By ETV Bharat Telangana Team

Published : Dec 20, 2023, 3:58 PM IST

Harish Rao Demands to Sitting Judge Trial on Medigadda

Harish Rao Demands to Sitting Judge Trial on Medigadda : రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ విశయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్ చేశారు. తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై విచారణకు తాము సిద్ధమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, నిజమేంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని హరీశ్​రావు అన్నారు.

Conduct a Trial by a Sitting Judge on Medigadda :హరీశ్​రావు వ్యాఖ్యలకు స్పందించిన రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుందన్నారు. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారన్నారు. మిషన్‌ భగీరథతో రూ.5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పినట్లు వివరించారు. రూ. 80వేల కోట్లతో కాళేశ్వరం కట్టామనడం అబద్దమని, ప్రాజెక్టు కార్పొరేషన్ రుణమే రూ.97,448 కోట్లు మంజూరైందని సీఎం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details