తెలంగాణ

telangana

'ఒలింపిక్స్​లో స్వర్ణమే లక్ష్యం'.. పంచ్​ల సివంగి నిఖత్​ జరీన్​

By

Published : Apr 4, 2023, 9:30 AM IST

Nikhat Zareen

Nikhat Zareen Interview: సాధారణ మధ్య తరగతి కుటుంబం.. ఎన్నో ఆటుపోట్లు.. ఆడపిల్లకు ఇలాంటి ఆటలేంటి అంటూ అవమానాలు.. వాటన్నింటిని దాటి ప్రపంచానికి తన సత్తా చాటింది తెలుగమ్మాయి నిఖత్​ జరీన్. వరుసగా రెండోసారి మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలను తన ఖాతాలో వేసుకుంది. చిన్నతనం నుంచే బాక్సింగ్‌పై మక్కువ పెంచుకున్న నిఖత్​ జరీన్​ జూనియర్ కేటగిరీలో సైతం వరల్డ్ ఛాంపియన్ షిప్ నెగ్గటం విశేషం. విశ్వవేదికపై అగ్రశ్రేణి క్రీడాకారులు ఒక్కొక్కరిని మట్టికరిపిస్తూ.. పంచ్‌ పంచ్‌కు సరైన పంచ్ ఇస్తూ రెండోసారి పసిడి పతకాన్ని అందుకుంది. స్వర్ణం మీద తన పేరే రాసిపెట్టినట్లు.. ఓటమిని అంగీకరించేదే లేదన్నట్లు మెరుపు పంచ్‌లతో ప్రత్యర్థిపై సివంగిలా విరుచుకుపడ్డ జరీన్‌.. రింగ్‌లో విజయనాదం చేసింది. భారత బాక్సింగ్‌ కేరాఫ్‌ నిఖత్‌ అన్నట్లు ఆటను సాగించిన ఈ ఉమెన్‌ బాక్సర్‌ తదుపరి లక్ష్యం ఒలిపింక్స్ అంటోంది. అందుకు తాను చేస్తున్న కసరత్తులు, ఇప్పటి వరకు సాగిన ప్రస్థానాన్ని నిఖత్‌ మాటల్లోనే తెలుసుకుందాం.

ABOUT THE AUTHOR

...view details