తెలంగాణ

telangana

'క్వాలిఫైడ్​ డాక్టర్​ దగ్గర ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు కొనుగోలు చెయ్యాలి'

By

Published : Mar 19, 2023, 10:08 PM IST

ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌రావు

Interview with IMA State President BN Rao: వైద్యుల ప్రమేయం లేకుండా ఔషధాల వినియోగాన్ని నివారించాలని కోరుతున్నట్లు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్‌రావు అన్నారు. కెమిస్టు డ్రగిస్టుల లైసెన్సుల జారీలో నిబంధలు ఉన్నప్పటికి మామూళ్లకు ఆశపడి తప్పులు చేస్తున్నారని తెలిపారు. కొన్ని చోట్ల సిబ్బంది కొరత కారణంగా మరికొన్ని చోట్ల ఆదేశాలు అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. ప్రతి చిన్న జబ్బుకు స్పెషలిస్టుల వద్దకు వెళ్లితే ప్రోటోకాల్ ప్రకారం టెస్టులకు పంపించాల్సి వస్తుందని అందువల్ల చిన్నచిన్న జబ్బులకు ఫిజిషియన్లకు వద్దకు వెళితే ఆర్థిక భారం ఉండదని ఆయన పేర్కొన్నారు. 

కేవలం అర్హత గల వైద్యుల వద్దకే ప్రజలు వెళ్లాలని.. నిబంధనల ప్రకారం ఔషధాలు వినియోగించాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తామని బీఎన్‌ రావు చెప్పారు. పర్యవేక్షణ సరిగ్గా అవ్వలేదని అన్నారు. కొంత మంది వ్యక్తులు వారి స్వలాభం కోసం అక్రమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి వ్యాధికి సరైన మందులు వాడకుండా వేరే మెడిసన్​ ఉపయోగిస్తే సైడ్​ ఎఫెక్ట్​​లు వస్తాయని తెలిపారు. వైద్యాన్ని వ్యాపారం చేయరాదని చెప్పారు. ఈ విషయం ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details