తెలంగాణ

telangana

విద్యార్థి దశ నుంచి ఓటమి తెలియదు - గజ్వేల్​లో ఓటమి నాలో కసిని పెంచింది : ఈటల రాజేందర్

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 6:13 PM IST

Etela Rajender Fires On KCR

Etela Rajender Fires On KCR: విద్యార్థి దశ నుంచి ఓటమి తెలియదని బీజేపీ సీనియర్‌ నాయకుడు ఈటల రాజేందర్‌ అన్నారు. గజ్వేల్‌లో ఓటమి తనలో ఇంకా కసిని పెంచిందని ఆయన వ్యాఖ్యానించారు. గజ్వేల్‌ నియోజకవర్గ బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఈటల రాజేందర్‌ సమావేశమయ్యారు. గజ్వేల్‌లో డబ్బు, మద్యం పంపిణీ చేసి కేసీఆర్ గెలిచారని ఈటల ఆరోపించారు. గజ్వేల్‌లో నైతికంగా బీజేపీ గెలిచిందని ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు.

Etela Rajender Meeting In Gajwel :కేసీఆర్‌ ప్రజలను నమ్ముకున్న నాయకుడు కాదని ఎద్దేవా చేశారు. భూ నిర్వాసితులు ఏకగ్రీవంగా తమకు ఓటు వేస్తామని మాట ఇస్తే, వారికి కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు చరమ గీతం పాడటానికి తనలాంటి నాయకులు అవసరమని తెలిపారు. ఈ ఎన్నికల్లో 15 శాతానికి పైగా ఓట్లు సాధించి రేపటి భవిష్యత్ ఎన్నికలకు బీజేపీ పార్టీ పునాదులు వేసుకుందని అన్నారు. ఒక విజయం అనేక తప్పులను కప్పిపుచ్చితే, అపజయం అనేక తప్పులను ఎత్తి చూపుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details