తెలంగాణ

telangana

సఫారీ బస్​పైకి దూసుకొచ్చిన గజరాజు.. పర్యటకులు హడల్​

By

Published : May 2, 2022, 1:04 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Elephant attack: ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్ జాతీయ పార్కులో ఓ ఏనుగు సఫారీ వాహనంపై దాడికి యత్నించింది. పార్కులోని ఢికాలా జోన్‌లోకి సఫారీ వాహనం ప్రవేశించగా అందులోని పర్యటకులకు ఏనుగుల గుంపు తారసపడింది. వాటిని చూసేందుకు డ్రైవర్‌ కొద్ది సేపు వాహనాన్ని నిలిపివేశారు. ఈ క్రమంలో వాహనాన్ని గమనించిన గుంపులోని ఓ ఏనుగు ఒక్కసారిగా పర్యటకులపైకి దూసుకొచ్చింది. వెంటనే అప్రమత్తమైన సఫారీ డ్రైవర్‌ వాహనాన్ని వేగంగా వెనక్కి నడిపాడు. ఏనుగు వాహనానికి అత్యంత సమీపంలోకి రాగా.. భయంతో అందులోని పర్యటకులు కేకలు వేశారు. వారి అరుపులకు బెదిరిపోయిన గజరాజు వెంటనే ఆగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details