తెలంగాణ

telangana

Crops Damage Bhainsa 2023 : 'పంటలన్నీ మునిగాయి.. ఆదుకోండి సారూ'.. ఎమ్మెల్యే కాళ్లపై పడ్డ మహిళా రైతు

By

Published : Jul 29, 2023, 1:11 PM IST

crops

Bhainsa Crops Damage Rain in Nirmal District : : భారీ వర్షాలకు తమ పంటపొలాలు కొట్టుకుపోయాయని తమను ఆదుకోవాలని ఓ మహిళా రైతు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాళ్లపై పడిన ఘటన భైంసా మండలంలో చోటుచేసుకుంది. పంట నష్టపోయిన తమకు పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. వరద విలయం ఉత్తర తెలంగాణ జిల్లాలకు తీరని నష్టాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. వరదల ధాటికి పలువురు ప్రాణాలు కోల్పోవటం, ఊళ్లు మునిగిపోగా... పంట పొలాలైతే గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. నిర్మల్‌ జిల్లాలో వరదల ధాటికి భైంసా మండలం ఇలేగామ్‌లో పంటపొలాలు సాగుకు పనికి రాకుండా పోయాయి. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరి హద్దులు చెరిగిపోయాయి. ఇసుక మేట, రాళ్లు, మట్టిపెళ్లలలతో పొలాలు వాగులను తలపిస్తున్నాయి. పొలాల హద్దులు చెరిగిపోవడంతో ఎవరి భూమి ఎక్కడుందో.. తెలియని పరిస్థితి నెలకొంది. పచ్చని పంటలతో కళకళలాడే పొలాలు.... వరద విధ్వంసానికి రూపురేఖలు మారిపోవటంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. వరద విధ్వంసం సృష్టించినా అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో మేట వేసిన ఇసుక, రాళ్లను తొలగించాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details