తెలంగాణ

telangana

Congress Leader Mallu Ravi on Ponnala Issue : పొన్నాల కాంగ్రెస్​వైపే ఉండాలని కోరుకుంటున్నాం : మల్లు రవి

By ETV Bharat Telangana Team

Published : Oct 14, 2023, 6:14 PM IST

Congress Senior Leader Ponnala Resign Issue

Congress Leader Mallu Ravi on Ponnala Issue :మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్​వైపే ఉండాలని కోరుకుంటున్నట్లు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి అన్నారు. మొన్నటి దాకా తిట్టి.. బీఆర్​ఎస్​లోకి పొన్నాల వెళ్లడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. సోషల్‌ మీడియాలో చూస్తే బీఆర్ఎస్‌ నాయకులు, దాని డీఎన్ఏను దూషించిన వారిలో మొదటిస్థానంలో పొన్నాల ఉంటారని అన్నారు.

Congress Senior Leader Ponnala Resign Issue : ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగిని ప్రవళిక ఇంటికి వెళ్లి ఓదార్చే సమయం కేటీఆర్‌కు లేదు కానీ.. కాంగ్రెస్​కు రాజీనామా చేసిన పొన్నాల ఇంటికి వెళ్లడానికి మాత్రం సమయం ఉంటుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీసీ అయిన ఈటల రాజేందర్​పై కుట్ర చేసి హింస పెట్టి పార్టీ నుంచి బయటకు పంపించారని విమర్శించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్, కేటీఆర్‌కు లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా వివరించారు.

ABOUT THE AUTHOR

...view details