తెలంగాణ

telangana

Bhatti Vikramarka Interview : 'ఇందిరమ్మ రాజ్యం కోసమే పాదయాత్ర.. వాటి పరిష్కారం దిశగా మేనిఫెస్టో'

By

Published : Jul 1, 2023, 10:33 PM IST

Bhatti Vikramarka

Bhatti Vikramarka People March Padayatra : పీపుల్స్ మార్చ్ పాదయాత్ర రాష్ట్ర కాంగ్రెస్​లో సరికొత్త ఊపు తీసుకొస్తుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలసి వారి కష్టాలు, సమస్యలు తెలుసుకున్నట్లు వివరించారు. పాదయాత్రలో తెలుసుకున్న అంశాలన్నింటిని ఏఐసీసీకి నివేదిక రూపంలో అందజేసి.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భట్టి స్పష్టం చేశారు. 

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ఇందిరమ్మ రాజ్యం కోసం పాదయాత్ర కొనసాగించానని భట్టి తెలిపారు. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడంతోపాటు ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానన్నారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజ‌క‌వ‌ర్గంలోని పిప్పిరిలో పాదయాత్ర ప్రారంభం కాగా.. మొత్తం 109 రోజుల పాటు 17 జిల్లాల్లో పాదయాత్ర సాగింది. 36 నియోజకవర్గాల్లో 1360 కిలోమీటర్ల మేర దాదాపు 750 గ్రామాల మీదుగా భట్టి విక్రమార్క పాదయాత్రగా.. వివిధ వర్గాల ప్రజలను భట్టి విక్రమార్క కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేటితో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగియనున్న సందర్భంగా భట్టి విక్రమార్కతో ఈటీవీ, ఈటీవీ భారత్​ ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details