తెలంగాణ

telangana

Minister satyavathi Vs MLA Redya Naik : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే.. మంత్రి వర్గాల మధ్య వాగ్వాదం

By

Published : Jul 13, 2023, 4:12 PM IST

Updated : Jul 13, 2023, 5:25 PM IST

MLA VS Minister

BRS MLA Redya Naik vs Minister satyavathi in Mahabubabad : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చేపట్టిన 'పల్లె పల్లెకు రెడ్యానాయక్' కార్యక్రమానికి నిరసన సెగ తప్పడం లేదు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కొందరు.. మంత్రివర్గానికి సంబంధించిన మరికొందరు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.

కురవి మండలం జగ్యా తండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే  తండాకు చేరుకున్నారు. తండాలో నెలకొన్న సమస్యలతో పాటు మిషన్ భగీరథ జలాలు అందడం లేదంటూ తండా వాసులు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించగా తోపులాట చోటుచేసుకుంది.  తండాకు చెందిన ఇద్దరినీ బలవంతంగా పోలీసులు వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా తండా వాసులంతా వాహనం వద్దకు రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.  పోలీసులు ఒకరిపై చేయి చేసుకున్నట్లు తండా వాసులు ఆరోపించారు. 

మొగిలిచర్లకు చేరుకున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు మరోసారి నిరసన సెగ తాకింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ వర్గీయులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహనానికి ఎదురుగా నిలబడి గో బ్యాక్ అంటు నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందినవారు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని.. రెండు పడక గదుల ఇళ్లకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలను నిరూపించాలంటూ మంత్రి వర్గీయులు నిరసనకు దిగారు. పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. అనంతరం పోలీసులు పరిస్థితిని సరి చేయడంతో ఎమ్మెల్యే పర్యటన ముందుకు సాగింది.

Last Updated : Jul 13, 2023, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details