తెలంగాణ

telangana

నామినేషన్ల వేళ ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తల కొట్లాట

By ETV Bharat Telangana Team

Published : Nov 9, 2023, 3:22 PM IST

Updated : Nov 9, 2023, 3:30 PM IST

BRS and Congress Clash at Ibrahimpatnam

BRS and Congress Clash at Ibrahimpatnam : నామినేషన్ల వేళ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఒకే రోజు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్‌తో 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు వందలాదిగా తరలివచ్చారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి.. ఇవాళే నామినేషన్‌ వేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనసమీకరణ చేయటంతో పట్టణమంతా ర్యాలీలు, జెండాలు, మైకుల మోతతో మార్మోగింది. ఉదయమే నామినేషన్‌ వేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.. కార్యకర్తలతో కలిసి ఆర్‌ఓ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. 

Manchireddy Kishanreddy Vs Malreddy Rangareddy : అప్పటికే మరోవైపు మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులతో భారీ ర్యాలీగా వచ్చారు. ఇరువర్గాలు బస్సు డిపో వద్ద ఎదురుపడగా.. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వివాదం చెలరేగి.. ఇరువర్గాలు రాళ్లు విసురుకున్నారు. అప్పటికే పెద్దఎత్తున పోలీసులు మోహరించినా.. అదుపుచేయటం కష్టంగా మారిపోయింది. ఈ క్రమంలో ఒకరిద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఎట్టకేలకు లాఠీలకు పనిజెప్పిన పోలీసులు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణులను చెదరగొట్టారు. అనంతరం, ఆర్డీఓ కార్యాలయంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి నామినేషన్‌ వేశారు.

Last Updated : Nov 9, 2023, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details