తెలంగాణ

telangana

గుడిలో పర్సు దొంగిలించిన చిన్నారి - వైరల్​గా మారిన వీడియో

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 9:17 PM IST

Boy Theft the Purse in Ramanthapur Temple

Boy Stealing Purse in Ramanthapur Temple :హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ శివాలయంలో ఓ బాలుడు పట్టపగలే దొంగతనం చేశాడు. చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీకెమెరాల్లో రికార్డ్​ అయ్యాయి. ‌ఈ దొంగతనంపై ఆలయ నిర్వాహకులకు ఆమె సమాచారం అందించింది.

ఆర్టీసీ కాలనీకి చెందిన ఓ మహిళ‌ భక్తురాలు పాత రామంతాపూర్​లోని శివాలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో ఆమె తన బ్యాగ్​ను ఓ చోట పెట్టి గుడి చుట్టూ ప్రదక్షణలు చేస్తోంది. బయట నుంచి అతివేగంగా వచ్చిన ఓ బాలుడు గర్భగుడి వద్దకు వెళ్లి అక్కడి నుంచి సదరు మహిళ పెట్టిన బ్యాగ్​ వద్దకు వచ్చాడు. అటుఇటు చూసి బ్యాగ్​లో ఉన్న పర్సును తీసుకొని వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దేవుడి దర్శనం అనంతరం బ్యాగు చూసుకున్న మహిళ పర్సు కనిపించకపోవడంతో ఆలయ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. ఆలయ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలిస్తే బాలుడు చేసిన చోరీ దృశ్యాలు నమోదు అయ్యాయి. పర్సులో రూ.15 వేల నగదు, సెల్​ఫోన్​ ఉందని బాధితురాలు చెప్పింది. దొంగతనం చేసినది బాలుడు కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details