తెలంగాణ

telangana

MP Dharmapuri Arvind on Jeevan reddy : "జీవన్​రెడ్డి సాయం చేశారన్న.. వార్తల్లో వాస్తవం లేదు"

By

Published : Jul 24, 2023, 7:49 PM IST

Dharmapuri Arvind

MP Dharmapuri Arvind on Double bedroom : గత ఎన్నికల్లో తన గెలుపు కోసం కాంగ్రెస్​నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సాయం చేశారని వస్తున్న వార్తలను.. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఖండించారు. బీజేపీ కోసం తన తండ్రి మాటను సైతం లెక్కచేయలేదని.. అలాంటిది జీవన్‌రెడ్డి గెలుపు కోసం ఎలా సహకరిస్తానంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోదీ అంటే ఇష్టమని.. బీజేపీ గెలుపు కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ డబుల్​బెడ్​రూం ఇళ్లను పంపిణీ చేయాలని జగిత్యాలలో.. ఎంపీ ధర్మపురి అర్వింద్ నేతృత్వంలో బీజేపీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కొత్తగా ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం అందజేసే అవాజ్‌ యోజన పథకం అందజేస్తే.. తెలంగాణలో ఎందుకు అమలు చేయటంలేదని మండిపడ్డారు. డబుల్ బెడ్​రూం ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి సొమ్ము, కాళేశ్వరంలో దొచుకున్న సొమ్ముతో.. మహారాష్ట్రలో పార్టీ ప్రచారం కోసం ఖర్చు చేస్తున్నారన్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత తనపై పోటీ చేసేందుకు భయపడుతున్నారని.. తనపై మరో వ్యక్తిని పోటీకి దింపి తనను ఓడిస్తానని పేర్కొనటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details